జర్నలిస్టుల కోర్కెల దినం పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ పిలుపు మేరకు అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముందుగా అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ ఈ ఎం జె ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆళ్ల వెంకట అప్పారావు, సీనియర్ జర్నలిస్టు మద్దాల రాంబాబు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మల్ల భాస్కరరావు, భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చాగంటి సర్వారావు (అవ్వ) తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు మీడియా సంస్థలు రక్షణ కోసం ప్రత్యేక కేంద్ర చట్టం అమలు చేయాలని, వర్కింగ్ జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధంచాలని కోరారు. మీడియా ఉద్యోగాల కోసం నూతన వేజ్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెస్టింగ్ వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, హెల్త్ స్కీము సక్రమంగా అమలు చేయడానికి జర్నలిస్టుల ప్రతినిధులు తో కూడిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఓటమి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ పాత్రికేయులకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో జర్నలిస్టులకు 50% రాయితీతో ఇచ్చిన రైల్వే పాసులు వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ నిరసన కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు బృందం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వై.వి.రమణాజీ, కె .భానుజీరావు, వీరబాబు,కర్రి గంగాధర్, బొద్దపు కిరణ్,మూర్తి, నంబారు సత్యారావు, ,మణికుమార్,పి.వి.ఎస్.రవి,కర్రి భాస్కర్ రావు,కే.బోసు, వై.జనార్ధన్ రావు,ఎన్.శ్రీను,రాజేష్, కె. సాయి, కే.సంతోష్,తదితరులు పాల్గొన్నారు.