🔴 రాడార్ ట్రిప్పులు రద్దు చేయాలి – ఒక బుకింగ్‌కు ఒక డ్రైవర్ విధానం పునరుద్ధరించాలి!
🔴 ఫెయిర్ లాక్, యాడ్ స్టాప్ విధానాలను వెంటనే తొలగించాలి – డ్రైవర్లపై అన్యాయ భారం ఆపాలి!
🔴 రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు 50% అదనపు నైట్ ఛార్జ్ అమలు చేయాలి!
🔴 భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఓలా బుకింగ్ పాయింట్‌ను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలి!
🔴 పికప్ పాయింట్‌కు యారో మార్కులు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలి!
🔴 డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి భోగాపురంలో ఓలా కార్యాలయం ఏర్పాటు చేయాలి!
భోగాపురం, సెప్టెంబర్ 11: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఓలా క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో చేపట్టిన రెండో రోజు సమ్మె సంపూర్ణంగా జరిగింది.
ఈ సందర్భంగా విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.జగన్ మాట్లాడుతూ, ఓలా యాజమాన్యం తక్షణమే రేట్లు పెంచి డ్రైవర్లకు గిట్టుబాటు ఆదాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఓలాలో ప్రస్తుతం అమలు చేస్తున్న రాడార్/బ్రాడ్‌కాస్ట్ ట్రిప్పుల కారణంగా ఒకే బుకింగ్‌కు పలువురు డ్రైవర్లకు ట్రిప్ సమాచారం వెళ్లి డ్రైవర్ల మధ్య అనవసర పోటీ ఏర్పడుతోందని ఆయన అన్నారు. పాత పద్ధతిలో ఒక బుకింగ్‌కు ఒక డ్రైవర్‌కు మాత్రమే ట్రిప్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
అలాగే సిటీ మరియు ఎయిర్‌పోర్ట్ ట్రిప్పులకు ఓలా ఇస్తున్న రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని, పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, వాహన నిర్వహణ ఖర్చులతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బి.జగన్ తెలిపారు. ఓలా రేట్లను తక్షణమే పెంచి, స్థిరమైన మరియు న్యాయమైన రేట్ల విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఫెయిర్ లాక్, యాడ్ స్టాప్ వంటి విధానాలను వెంటనే తొలగించాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 50 శాతం అదనపు నైట్ ఛార్జ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఓలా పికప్ పాయింట్ ప్రయాణికులకు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని, ప్రయాణికులు సులభంగా గుర్తించేలా యారో మార్కులు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.
GMR యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ సేవలకు సంబంధించి GMR యాజమాన్యం బాధ్యత తీసుకుని, ఓలా డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని బి.జగన్ డిమాండ్ చేశారు.
డ్రైవర్లకు సమస్య వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉందని, డ్రైవర్ల సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు భోగాపురంలో ఓలా మేనేజ్‌మెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే. పోల్నాయుడు, యూనియన్ నాయకులు సింహా, శ్రీను, కృష్ణ, చంటి, శ్రీనివాసు, శ్యామలరావు, రాంబాబు క్యాబ్ డ్రైవర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కె పోలినాయడు
ప్రధాన కార్యదర్శి
క్యాబ్ డ్రైవర్స్ యూనియన్.(citu)