*ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధి పొందిన 17 మందికి లబ్ధిదారులకు 17, 83,575 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
*పేదలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకం సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ..*
ఈ రోజు అనగా *11.09.2026* తేదీన పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం పొందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చేదని జనసేన విశాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో 17 మంది లబ్ధిదారులకు 17, 83,575 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ పేదలకు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిరంతరం తపన పడతారని అందులో భాగంగానే అర్హులైన పేదలందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఎన్ డి ఏ నాయకులు మీడియా మిత్రులు తనకు ఎంతో సంతృప్తినిచ్చే ఈ పధకం కోసం మీడియా విషేషంగా ప్రచారం చేయడం ప్రశంసనీయమన్నారు
సమాజంలో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకూడదన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని విరివిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.గత మూడు నెలల కాలంలో ఆగిపోయిన చెక్కులతో పాటు కొత్తగా మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేసారు నెలకు కనీసం రెండుసార్లు పేదలకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి క్యాంపు కార్యాలయానికి తీసుకొస్తే వారికి 15 రోజుల్లోనే తగిన ఆర్థిక సాయం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందే ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే రమేష్ బాబు హామీ ఇచ్చారు.
*సీఎం సహాయనిధి ద్వారా లబ్ధి పొందిన 17 మంది లబ్ధిదారుల యొక్క వివరములు*
➡️ బొబ్బరి పెంటయ్య,పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం ,37,887
➡️ దల్లి బంగారమ్మ,పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం , 60,258
➡️ కలిగి సాంబశివరావు,పెందుర్తి మండలం సారిపల్లి గ్రామం 31,795
➡️ కుంద్రేపు మహాలక్ష్మి,పెందుర్తి మండలం ఎస్.ఆర్.పురం 32,800
➡️ జిన్నాల రమణ,పెందుర్తి మండలం ఎస్.ఆర్.పురం గ్రామం , (LOC) 3,52,037
➡️పిల్ల వరలక్ష్మి, పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామం (LOC) 5,00,000
➡️ ఈసరపు యోగిత,సబ్బవరం మండలం గొటివాడ గ్రామం 34,737
➡️ మింది లక్ష్మి,సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామం 37,405
➡️ అర్జిల్లి సోములు,పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామం 55,901
➡️ కొమ్మనాపల్లి అప్పలరాజు,పరవాడ మండలం రావాడ గ్రామం 24,795
ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాలు డైరెక్టర్ బల్రెడ్డి అప్పారావు గారు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం గారు, పెందుర్తి ఏఎంసి వైస్ చైర్మన్ గోరపిల్లి సోమనాయుడు గారు, ఏఎంసీ డైరెక్టర్ లక్కీ గోవింద్ గారు, గల్లా శ్రీనివాసరావు గారు, ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ గారు,వార్డు అధ్యక్షులు కంచిపాటి మధు గారు ఉబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారు,సేనాపతి సోమశేఖర్ గారు,మాజీ సర్పంచులు మోటూరు సన్యాసి నాయుడు గారు, సిరపరపు అప్పలనాయుడు గారు,చింతకాయల సుజాత ముత్యాలు గారు, పెందుర్తి సిహెచ్ నెంబర్ వరూధిని గారు, సరిపిల్లి విష్ణు గారు,గొర్లి అప్పారావు గారు, కాగిత ఎర్రి బాబు గారు,రాపర్తి కిషోర్ గారు, మడక బంగార్రాజు గారు, అంబటి వెంకటేశ్వరరావు గారు, గన్రెడ్డి రమేష్ గారు తదితర పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.