*శ్రీ ఎర్నిమాంబ దేవాలయ షెడ్లు పునర్నిర్మానం చేయండి!*
* *ఇది అమ్మవారి ప్రాంతం, షెడ్లు తొలగించడానికి మీరెవరు*?
* *చేసిన తప్పులపై అమ్మవారినీ క్షమాపణ కోరండి!*
* *జీవీఎంసి టౌన్ ప్లానింగ్, కూటమి ప్రభుత్వ వైఫల్యం సిగ్గుచేటు*
* *షెడ్లు కూల్చుతుంటే స్థానిక జనసేన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు?*
* *వర్షంలోనూ ఆగని వాసుపల్లి ఆందోళన..*.
* *భక్తులతో రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన*
*ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే సంతాన లక్ష్మిగా విరాజుల్లుతున్న జ్ఞానాపురం శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయ కూల్చివేత చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు, వైసీపీ శ్రేణులతో కలిసి ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంతంలో కూల్చిన షెడ్లు వద్ద వర్షంలో తడుస్తూ రోడ్డుపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు*.*ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రోడ్లు రాకముందు నుండే శ్రీ ఎర్నిమాంబ అమ్మవారిని మత్స్యకారులు, స్థానిక పూర్వీకులు ప్రతిష్టించారని వాసుపల్లి గుర్తు చేశారు*. *దీర్ఘకాలిక భయంకరమైన రోగాల భారీ నుండి రక్షించేందుకు అమ్మవారిని ప్రతిష్టించారని చెప్పారు. అంతటి మహిమగల అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఆటంకం కలిగించడం దుర్మార్గమని కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు*.*భక్తుల తలనీలాలు సమర్పణ, అమ్మవారికి గాజులు మొక్కుబడులు చెల్లించే ప్రదేశాలు నీడనిచ్చేందుకు ఓ ధాత విరాళంతో షెడ్లు నిర్మించారన్నారు*. ఉన్న ఫలంగా త్రాగే నీటి పైపులతో సైతం జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చితే స్థానిక జనసేన ఎమ్మెల్యే ఒక్క ఫోన్ కాల్ తో అడ్డుకోగలరన్నారు. కానీ అలా జరగలేదన్నారు. ఎన్నో అక్రమాలు జరుగుతున్న వాటి జోలికి వెళ్లకుండా పవిత్ర దేవాలయంలో వేసిన షెడ్లపై అధికారులు చేసిన తప్పిదాలు ఒప్పుకొని అమ్మవారికి క్షమాపణ చెప్పి ముడుపు చెల్లించుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పైగా ఇక్కడే గంజాయి అసాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకనే షెడ్లు కూల్చామని కూటమి నేతలు హితవు పలకడం పట్ల వాసుపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతనం ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండి ఈ ప్రాంత దేవాలయానికి అన్యాయం జరిగితే మాట్లాడరా? అని మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్ వక్ర బుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. గంజాయి బ్యాచ్ ని అరికట్టలేరా, ఆలయానికి రక్షణ కల్పించకుండా చిల్లర రాజకీయాలు చేసి షెడ్లు తొలగించడం దారుణమన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని షెడ్లో పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ చిన్న తట్ట కూడా తొలగించకుండా ఆలయ పవిత్రతను కాపాడుకున్నామని ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ గుర్తు చేశారు. ప్రతి లక్ష్మివారం మంగళవారం ఆదివారం అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు ఉత్తరాంధ్ర నుండి వేలాది మంది భక్తులు వస్తున్నారన్నారు. వారికి నీడ మౌలిక వసతులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. రానున్న ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆలయ ప్రతిష్టను, భక్తుల సౌకర్యాలకు శాశ్వత పరిష్కారం అందిస్తామని ఈ సందర్భంగా వాసుపల్లి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను, ఎర్రినమ్మ గుడి మాజీ చైర్మన్ లండ రమణ,మాజీ కార్పొరేటర్లు తోట పద్మావతి, వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వరరెడ్డి, పీతల వాసు,దస్మాంతుల మాణిక్యాల రావు, పిన్నింట్ల రాజారెడ్డి,ముత్తబత్తుల రమేష్,ఆలుపున కనకరెడ్డి, మహమ్మద్ షాకిల్, గురజారపు రవి, ముజీబ్ ఖాన్, భీశెట్టి ప్రసాద్,మాజీ కార్పొరేటర్ పత్చిరిపిళ్లి రాము, జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు,,స్టేట్ నాయాకులు దశమంతులు చిన్ని, బడిదబోయిన అప్పారావు,జిల్లా అనుబంధ సంఘాలు ప్రెసిడెంట్లు సనపల రవీంద్ర, సకల భక్తుల ప్రసాద్, వాసుపల్లి ధనరాజు జిల్లా అనుబంధ సంఘాల ఉపాధ్యక్షులు,సౌత్ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, జిల్లా అనుబంధ సంఘాలు, వార్డ్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, దక్షిణ వైసిపి సీనియర్ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ వైసిపి మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.