--:-- | Today 28°C · Weather
Breaking

శక్తివంతమైన రాజకీయ శక్తిగా బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కంకణ

Sep 9, 2026 4:36 19 views 1

Description

బద్దులై పనిచేస్తున్నారని ఆ పార్టీ జిల్లా నాయకులు స్పష్టం చేశారు. బిజెపి అనకాపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం పెందుర్తిలోని తాండ్రపాపారాయ కళ్యాణ మండపంలో మంగళవారం ఘనంగా జరిగింది. బిజెపి జిల్లా కార్యదర్శి గొర్రె రామునాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్, మహిళా మోర్చా నాయకురాలు నాదెళ్ల జ్యోతి, చొక్కాకుల వెంకటరావు సహా అన్ని విభాగాల మోర్చా నాయకులు, జిల్లా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే అంశాలపై కసరత్తు చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వరరావు, ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారత ప్రధానిగా 12 ఏళ్లు... మొత్తం 25 ఏళ్లు రాజకీయ జీవితం పూర్తి చేసినందున దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయని వెల్లడించారు. భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మోడీ రాజకీయ జీవితంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బిజెపి అభ్యర్థుల గెలుపుపైనా సమావేశంలో చర్చించారు. అనంతరం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె రామునాయుడు మీడియాతో మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, జనసేనకు దీటుగా తమ అభ్యర్థులను బరిలో దించుతామని, ఆయా స్థానాల్లో తప్పక విజయం సాధిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కోరతామని, ఇప్పటికే ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు తమ అభ్యర్ధనను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్డీఏ కూటమి నుండి తాను ఈ దఫా కూడా బర్రిలో దిగి జీవీఎంసీ కౌన్సిల్ లో అడుగు పెడతానని రామునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటు పార్టీలోను అటు ఎన్డీఏ కూటమిలోనూ సమన్వయం చేసుకుని బిజెపి అభ్యర్థులను పోటీలో నిలుపుతామని తెలియజేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఇప్పటికే నాయకులకు దీనిపై దిశ నిర్దేశం చేశారని ఆయన వెల్లడించారు

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now