--:-- | Today 28°C · Weather
Breaking

కూటమి పాలనలో విశాఖకు తీవ్ర అన్యాయం: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి*

Oct 30, 2026 11:15 52 views 1

Description

*

-మౌలిక వసతులు, ట్రాఫిక్ సమస్య పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత

-బీసీ మహిళగా, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి

రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజలు తీవ్ర విస్మకారంలో ఉన్నారని, విశాఖ నగరంలో అభివృద్ధి కుంటుపడిందని వైసీపీ ఎమ్మెల్సీ, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి 35 వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. విశాఖ ప్రజలు కూటమి పాలనతో విసిగిపోయారని, సింహాచలం అప్పన్న కొండల విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పట్టించుకోకుండా కార్మికులను రోడ్డున పడేశారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో పాటు అమరావతి నిర్మాణం కోసం నిధులు తరలిస్తున్నారని ఆరోపించారు. 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ఎంపీ నేడు వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తున్నారని, కూటమికి ఓటేస్తే భూకబ్జాలను ప్రోత్సహించినట్లే అవుతుందని హెచ్చరించారు. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈసారి జరగబోయే స్థానిక ఎన్నికలు.. రాబోయే సాధారణ ఎన్నికలకు తొలి అడుగు అని వరుదు కళ్యాణి పేర్కొన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తనను మేయర్ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై గెలిపించాలని, అలాగే స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి పెదగాడ బాబ్జిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విశాఖ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Related Videos

వైయస్సార్‌సీపీ 36వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సనపల రోహిణి గెలుపే లక్ష్యంగా ప్రచారం*
Oct 30, 2026

వైయస్సార్‌సీపీ 36వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సనపల రోహిణి గెలుపే లక్ష్యంగా ప్రచారం*

* వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 36వ వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారంలో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి, దక్షిణ నియోజ…

Watch Now
62వ వార్డులో ఘనంగా కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ ఎన్నికల ప్రచారం*
Oct 30, 2026

62వ వార్డులో ఘనంగా కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ ఎన్నికల ప్రచారం*

*62వ వార్డులో ఘనంగా కూటమి కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ ఎన్నికల ప్రచారం* 62వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నీరుక…

Watch Now
కూటమి అభ్యర్థి తాతినేని సునీతకు ప్రజా మద్దతు వెల్లువ* ll VVw news
Oct 30, 2026

కూటమి అభ్యర్థి తాతినేని సునీతకు ప్రజా మద్దతు వెల్లువ* ll VVw news

*కూటమి అభ్యర్థి తాతినేని సునీతకు ప్రజా మద్దతు వెల్లువ* -61వ వార్డులో జోరుగా సాగుతున్న ఇంటింటి ఎన్నికల ప్రచారం జీవీఎంసీ 61వ వార్డులో కూటమి ఉమ…

Watch Now