విజయనగరం పోలీసు వాస్తవాలను వెలికితీసి వ్యవస్థలను సన్మార్గంలో నడిపించుటలో జర్నలిస్ట్స్ పాత్ర ఎనలేనిది
Description
*||విజయనగరం జిల్లా పోలీసు||*
*||వాస్తవాలను వెలికితీసి వ్యవస్థలను సన్మార్గంలో నడిపించుటలో జర్నలిస్ట్స్ పాత్ర ఎనలేనిది||*
*- విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్*
🌀 *ప్రజల్లో అవగాహన కల్పించే కథనాలకు ప్రాధాన్యత కల్పించాలన్న జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్*
విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సెప్టెంబరు 20న నిర్వహించిన 27వ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వార్షిక మహా సభకు జిల్లా ఎస్పీ శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ - దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించే సమయంలో మీడియా నిర్ణయాత్మక పాత్ర పోషించిందని, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, వారిలో దేశభక్తి నింపుతూ, బ్రిటిష్ వారికి ఎదురుగా నిలిచి, దేశం కోసం జైలుకు వెళ్లడం, తమ ప్రాణాలను కోల్పోవడానికి కూడా వెనుకాడేవారు కారన్నారు. అదే విధంగా నేటి కాలంలో మీడియా ప్రతినిధులు కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే విషయాలను తమ వార్తలు, కథనాలతో అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి, వాటిని పరిష్కరించే విధంగాను, ప్రజలకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తూ వ్యవస్థలను సన్మార్గంలో నడిపిస్తున్నదన్నారు. చెడు వ్యసనాలు, గంజాయి, బెట్టింగ్స్, మద్యం వలన కలిగే నష్టాలను ప్రజలకు తెలుపుతూ నేటి మీడియా సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అని ప్రజలకు ఎన్నో రకాలుగా వివిధ వార్తలు అందిస్తున్నప్పటికీ, ఆయా వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను కూడా ఒకసారి నిర్ధారించు కోవాలన్నారు.
ప్రజలను అప్రమత్తం చేసేందుకు నేరాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు మీడియా మరింత క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. వివిధ నేరాలు జరుగుతున్న తీరు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, మళ్ళీ ఆయా నేరాలు జరగకుండా ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలన్నారు. గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాలు, బెట్టింగ్స్ వలన కలిగే అనర్థాలను, దుష్ప్రభావాలను ప్రజలకు తమ కథనాలతో వివరించాలన్నారు. మహిళలు, చిన్నారులు, రహదారి భద్రత పట్ల ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి, నేరాల నియంత్రణలో పోలీసులతో జర్నలిస్ట్స్ కలిసి పని చేయాలని, నేరరహిత నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
మీడియాపై దాడుల నియంత్రణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని, దాడులకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టడానికి వెనుకాడబోమని జర్నలిస్ట్ సోదరులకు జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు. అదే విధంగా అక్రిడేషన్ పొందిన జర్నలిస్ట్స్ కు క్యూఆర్ కోడ్ తో కూడిన వెహికల్ పాస్ లను కూడా త్వరలో అందజేస్తామని జిల్లా ఎస్పీ శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ తెలిపారు.
APUWJ తరుపున జర్నలిస్ట్స్ జిల్లా ఎస్పీ శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గార్ని శాలువ, పుష్ప గుచ్చంతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, APUWJ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, జిల్లాలో వివిధ సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్ట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*||జిల్లా పోలీసు కార్యాలయం,||*
*||విజయనగరం.||*

Previousదళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదుకూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి
Nextవినాయకుడి సేవలో అన్నదానం*బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన* ut
Related Videos
Sep 20, 2026
*పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు టిఎస్ఆర్ ను ప్రేమిస్తారు* సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు
*పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు టిఎస్ఆర్ ను ప్రేమిస్తారు* *సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు అన్ని రంగాలలోనూ ఆయనకు ఆయనే సాటి* *విశాఖ…
Watch Now
Sep 20, 2026
వినాయకుడి సేవలో అన్నదానం*బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన* ut
*వినాయకుడి సేవలో అన్నదానం* *బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన* ---- *కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు, తెలుగు శక్తి అ…
Watch Now
Sep 19, 2026
దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదుకూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి
దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు కూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి విశాఖపట్నం: దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెంది…
Watch Now