--:-- | Today 28°C · Weather
Breaking

వినాయకుడి సేవలో అన్నదానం*బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన* ut

Sep 20, 2026 1:26 6 views 2

Description

*వినాయకుడి సేవలో అన్నదానం*

*బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన*

---- *కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు, తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్*

విశాఖపట్నం: జీవీఎంసీ 46వ వార్డు పరిధిలోని సంతోష్ నగర్, విశాఖపట్నంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు, తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... వినాయక చవితి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత, భక్తి భావం మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఫిలిం డైరెక్టర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ వి.వంశీ బాబు, బాల గణేష్ యూత్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Videos

*పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు టిఎస్ఆర్ ను ప్రేమిస్తారు* సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు
Sep 20, 2026

*పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు టిఎస్ఆర్ ను ప్రేమిస్తారు* సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు

*పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు టిఎస్ఆర్ ను ప్రేమిస్తారు* *సేవ, కళ, ఆధ్యాత్మిక, రాజకీయంతో పాటు అన్ని రంగాలలోనూ ఆయనకు ఆయనే సాటి* *విశాఖ…

Watch Now
విజయనగరం పోలీసు వాస్తవాలను వెలికితీసి వ్యవస్థలను సన్మార్గంలో నడిపించుటలో జర్నలిస్ట్స్ పాత్ర ఎనలేనిది
Sep 20, 2026

విజయనగరం పోలీసు వాస్తవాలను వెలికితీసి వ్యవస్థలను సన్మార్గంలో నడిపించుటలో జర్నలిస్ట్స్ పాత్ర ఎనలేనిది

*||విజయనగరం జిల్లా పోలీసు||* *||వాస్తవాలను వెలికితీసి వ్యవస్థలను సన్మార్గంలో నడిపించుటలో జర్నలిస్ట్స్ పాత్ర ఎనలేనిది||* *- విజయనగరం జిల్లా ఎ…

Watch Now
దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదుకూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి
Sep 19, 2026

దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదుకూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి

దళితుల భూములు ఆక్రమిస్తే సహించేది లేదు కూటమి నేతలు పేదల భూములపై కన్నేశారు: మంచ నాగమల్లేశ్వరి విశాఖపట్నం: దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెంది…

Watch Now