--:-- | Today 28°C · Weather
Breaking

చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని తొలి స్కామ్ గా మార్చేశారు* *డీఎస్సీపై పవన్ కళ్యాణ్ మౌనం ఎందుకు?*

Sep 11, 2026 2:27 12 views 1

Description

*

*టీచర్ రిక్రూట్మెంట్ ను కాస్త టిడిపి రిక్రూట్మెంట్ గా మార్చిరు*

*డీఎస్సీ స్కామ్ లో బిజెపి, జనసేన పార్టీలు పాత్ర లేదు*

*విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి*

*డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి*

--- *ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్*

పెందుర్తి: డీఎస్సీలో జరిగిన భారీ అక్రమాలపై ఈ నెల 13న విశాఖలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పలేక పారిపోతున్నారని శుక్రవారం ఉదయం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ఆయన క్యాంప్ ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామ్ ఎమ్మెల్యే తో మాట్లాడుతూ డీఎస్సీ స్కామ్ లో బిజెపి, జనసేన పార్టీలు పాత్ర లేదు కానీ మీరు మౌనం వహిస్తే తప్పుడు సాంకేతికలు ప్రజల్లోకి వెళ్తున్నాయని తెలుగు శక్తి ఆ పార్టీలకు మనవి చేసుకుంటుంది తెలిపారు. మెగా డీఎస్సీపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని బి.వి.రామ్ ప్రశ్నించారు.
“నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన అంశంపై కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి” అని కోరారు.

అనంతరం రామ్ మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీపై నారా లోకేష్ బహిరంగ చర్చకు రావాలి, ఆరోపణలకు సమాధానం చెప్పాలి. నిజానిజాలు ప్రజలకు తెలియాలి. రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేని విధంగా ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్డ్ గా డీఎస్సీలో స్కామ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకాన్ని తొలి స్కామ్ గా మార్చేసారు. టీచర్ రిక్రూట్మెంట్ ను కాస్త టిడిపి రిక్రూట్మెంట్ గా మార్చి నిరుద్యోగులను నట్టేట ముంచారు. తక్షణమే లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి, తప్పు చేయనప్పుడు సిబిఐ విచారణ అంటే లోకేష్ ఎందుకు భయపడుతున్నారు?.

*టెట్ లేకుండా ఉద్యోగం*

సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం టెట్ అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వకూడదు. మరి ప్రభాకర్ గౌడ్ అనే వ్యక్తి టెట్ అర్హత సాధించకుండానే ఎలా టీచర్ ఉద్యోగం సాధించాడు?.

*స్పోర్ట్స్ కోటా దందా*

రూ. 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. జరగని జూడో టోర్నమెంట్లు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. ఫేక్ కోకో సర్టిఫికెట్లతో అన్నాచెల్లెళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. ఎమ్మెల్యే కోన రవికుమార్ ఎం.పీ భరత్ అధ్యక్షులుగా ఉన్న అసోసియేషన్ల సంతకాలతో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?.

*ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు స్కాం*

నిబంధనలకు విరుద్ధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి అడ్డగోలుగా పోస్టులు కట్టబెట్టారు.

*జీవోలు మార్పు*

అర్హులైన వారికి అన్యాయం చేస్తూ తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవో 47 ను సైతం మార్చివేశారు.

*డీఎస్సీపై పవన్ కళ్యాణ్ మౌనం ఎందుకు?*

మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి తరుపున పోరాడాలని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ స్పష్టం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పకుండా ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ కు హామీ ఇచ్చారు

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now