--:-- | Today 28°C · Weather
Breaking

30ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి**సిఐటియు బైక్ ర్యాలీ* ll

Jul 28, 2026 3:21 0 views 0

Description

మద్దిలపాలెం : ప్రెస్ నోట్

*30ఛలో కలెక్టరేట్ జయప్రదం చేయండి*

*సిఐటియు బైక్ ర్యాలీ*

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, డైలీవేజ్ కార్మికులకు కనీసవేతనం నెలకు 26000 రూ.లు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, డైలీవేజ్ కార్మికులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ డిమాండ్ చేసారు.

సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ధరలు ఆకాశాన్నంటుతున్నా వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, విద్యాసంస్థలు, హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. గత 11 ఏళ్ళుగా కనీసవేతనాల జిఓను సవరించకపోవడం దుర్మార్గమన్నారు. బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ సంస్థల అధిపతులకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర బిజెపి, రాష్ట్ర టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని కార్మికుల సంక్షేమ మరిచి కార్పొరేట్లకు సేవలు చేయడం సరికాదన్నారు. కనీసవేతనం 26వేలు అమలుతో పాటు ఉద్యోగ భద్రత, 8గంటల పనిదినం, ఇతర పాత కార్మిక చట్టాలు పటిష్టంగా అమలుకు పూనుకోవాలని ఈ నెల 30 వేలాదిమందితో కలెక్టరేట్ల వద్ద నిరసన జరుగుతుందని తెలియజేసారు. ప్రభుత్వాల మెడవంచి వేతనాలు పెంపుకోసం ఈ ధర్నాల్లో అన్నిరకాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమం మద్దిలపాలెం సిఐటియు కార్యాలయం వద్ద ప్రారంభమై మద్దిలపాలెం జంక్షన్, సత్యం జంక్షన్, సీతమ్మధార ఎమ్మార్వో ఆఫీస్ మీదుగా ఎంఎంటిసి కాలనీ, కృష్ణాకాలేజీ రోడ్డు, ఎంవిషి, అప్పుఘర్, పెదవాల్తేరు, శివాజీపార్కు రోడ్డు మీదుగా మద్దిలపాలెం చేరుకుంది.

ఈ బైక్ ర్యాలీలో సిఐటియు జోన్ కార్యదర్శి పి. వెంకటరావు, నాయకులు కె.కుమారి, వి.నరేంద్రకుమార్, అప్పడు, అనపర్తి అప్పారావు, భూలోకరావు, సింహాచలం తదితరలు పాల్గొన్నారు.

ఇట్లు
పి వెంకటరావు
కార్యదర్శి

Related Videos

సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని
Jul 28, 2026

సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని

సింహాచలం అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షణకు వచ్చే లక్షలాది భక్తులకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపార…

Watch Now
భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం ఏంటి? ll
Jul 28, 2026

భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం ఏంటి? ll

*భోగాపురం ఎయిర్పోర్ట్ నెల్లిమర్ల్లి కాన్స్టెన్సీ లో ఉందా లేక మంగళగిరి కాన్స్టెన్సీ లో ఉందా?.* భోగాపురం ఎయిర్పోర్ట్ తో నారా లోకేష్ కి సంబంధం …

Watch Now