--:-- | Today 28°C · Weather
Breaking

ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి

Jul 29, 2026 9:26 0 views 0

Description

* ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం పెందుర్తి మండలం పెద్దగాడి చెరువులో ఉన్న సంకల్ప కళా గ్రామంలో మారికవలసకు చెందిన ఇంటెల్లి విద్యా సంస్థ విద్యార్థులను తీసుకువెళ్లి అక్కడ సంకల్ప వ్యవస్థాపకులు ఆకులు చలపతిరావు ఏర్పాటుచేసిన కట్టే కానుక పని చేస్తున్న విధానం విద్యార్థులకు అవగాహన కల్పించారు. మట్టితో తయారు చేస్తున్న వినాయక ప్రతిమలను చూపించి పూజకు వీటిన వినియోగించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన రంగురంగుల వినాయకుల బొమ్మల వల్ల కలిగే నష్టాలను వివరించారు. అక్కడ ఉన్న ఆయుర్వేద మొక్కలను చూపించి వాటి గురించి నా వివరాలు తెలియజేశారు. విభిన్న రకాల పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు, పక్షులు గూళ్ళు పెట్టుకునే చెట్లను చూపించి వాటి గురించి వివరించారు. అలాగే సంకల్ప కళా గ్రామం ప్రతినిధి జమీలియా ప్రకృతి ఆధారంగా రంగులు వేసి చేస్తున్న కొయ్య బొమ్మల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం రత్నం మాట్లాడుతూ ప్రకృతి ఆధారిత పంటలు ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ప్రకృతి వనరుల పరిరక్షణ మానవాళి బాధ్యత అని వివరించారు. ప్రతి విద్యార్థి దేశీయ విత్తనాలు సేకరించి సామాజిక వనాలు పెంచాలని కోరారు. జంక్ ఫుడ్ వద్దే వద్దని దాని వల్ల కలిగే నష్టాలు వివరించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి ఆధారంగా ఉన్న ఆయుర్వేద వైద్యాన్ని పెంచుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి మేడ మీద, బాల్కనీలో, ఇంటి చుట్టుతో ఉన్న ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. కూరగాయలు వేద్దాలతో ఎరువులు తయారు చేసి మొక్కలు పెంచడం ద్వారా ఆ ఇంటి దగ్గర ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని వివరించారు. ఇంటి దగ్గర మొక్కలు పెంచడం ద్వారా మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇంటెల్లి ఉపాధ్యాయులు సృజన, శిరీష, శ్రీదేవి, భవానీ, హరిప్రియ, ప్రమీల, స్టెఫీ, విద్యార్థులు పాల్గొని మాట్లాడారు

Related Videos

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు
Jul 29, 2026

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే ఆలయంలో …

Watch Now
ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి*
Jul 29, 2026

ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి*

*ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి* విశాఖ జిల్లా మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) కాంట్రాక్టర్ల సమస్యల…

Watch Now
రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు
Jul 29, 2026

రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు

విశాఖ తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Watch Now
ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం
Jul 29, 2026

ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం

*ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం..* యోగా అనేది కేవలం వ్యాయామం కాదు.. అదొక ఆరోగ్యకరమైన జీవ…

Watch Now