విశాఖలో ఐదు లక్షల పైచిలుకఉన్న దళితులుకు మేయర్ సీటును కేటాయించాలిఒకసారికూడా కేటాయించపోవటం చాలా దారుణం
Description
*విశాఖలో ఐదు లక్షల పైచిలుక ఉన్న `దళితులుకు` మేయర్ సీటును కేటాయించాలి..*
ఒకసారి కూడా కేటాయించపోవటం చాలా దారుణం*
మద్దతు తెలిపిన తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్*
విశాఖపట్నం: దళిత నాయకుడు పెద్దాడ రమణ ఆధ్వర్యంలో విశాఖ మేయర్ సీటును దళితులకు డిమాండ్ చేశారు. తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్, బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ్ రావు మద్దతు తెలియజేస్తూ దళిత నేత పెద్దాడ రమణతో కలసి మంగళవారం
రామా టాకీస్ అంబేద్కర్ భవనం వద్ద, విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ మాట్లాడుతూ ఇప్పటివరకు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, రొటేషన్ లో నైనా ఇప్పటివరకు ఓసీలకు బీసీలకు మాత్రమే కేటాయించిన విశాఖ మేయర్ సీటు ను ఈసారి దళితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెద్దాడ రమణకు మద్దతు తెలియజేస్తూ వర్షంలో కూడా పెద్ద ఎత్తున దళిత మహిళలు హాజరై వారి డిమాండ్ అని పెద్ద ఎత్తున వినిపించారన్నారు. విశాఖలో ఐదు లక్షల పైచిలుక ఉన్న దళితులుకు మేయర్ సీటును కేటాయించాలని అన్ని పార్టీలు వారి మైండ్ సెట్ మార్చుకోవాలన్నారు. ఇప్పుడు దాకా దళితులకు ఒకసారి కూడా కేటాయించపోవటం చాలా దారుణం అని అన్నారు. బొడ్డు కళ్యాణ్ రావు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా విశాఖ మేయర్ స్థానాన్ని కేవలం బీసీలు ఓసీలకు మాత్రమే కట్టబెట్టారన్నారు. దళితుల్లో కూడా విద్యావంతులు ఉన్నారని, ఏ పార్టీ అయినా దళితులను చిన్నచూపు చూస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దళిత నాయకుడు పెద్దాడ రమణ మాట్లాడుతూ దళితులకు సముచిత స్థానం కల్పించిన పార్టీకే తమ మద్దతు తెలియజేస్తామన్నారు. విశాఖ మహానగర అభివృద్ధికి దళితుల పాత్ర కీలకమని, ఇప్పటివరకు ఏ పార్టీ కూడా దళితులను గుర్తించి మేయర్ సీటు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని విశాఖ మేరు స్థానాన్ని దళితులకు ఇవ్వాలని పెద్దాడ రమణ డిమాండ్ చేశారు.

Previousఅపోలో క్యాన్సర్ సెంటర్స్,విశాఖపట్నం మూడు సంవత్సరాల్లోనే 100 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ల మైలురాయిని
Nextవిశాఖలో ఐదు లక్షల పైచిలుకఉన్న దళితులుకు మేయర్ సీటును కేటాయించాలిఒకసారికూడా కేటాయించపోవటం చాలా దారుణం
Related Videos
Sep 22, 2026
అపోలో క్యాన్సర్ సెంటర్స్,విశాఖపట్నం మూడు సంవత్సరాల్లోనే 100 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ల మైలురాయిని
అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం మూడు సంవత్సరాల్లోనే 100 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ల మైలురాయిని అధిగమించింది విశాఖపట్నం 22 సెప్టెంబర్ …
Watch Now